Monday, September 8, 2025

సోమవారం రాశి ఫలాలు (08-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  నూతన ఆలోచనలు సాగిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తి- ఉద్యోగాలందు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభం –  జీవనశైలిలో కొన్ని నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పనిని సక్రమంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం – మానసికమైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సహ ఉద్యోగులతో చిన్నపాటి మాట పట్టింపులు వస్తాయి. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప ధన లాభం.

కర్కాటకం – నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. సన్నిహితులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తొలగిపోయి ఆనందంగా మెలగలుగుతారు. పంతాలు పట్టింపులకు దూరంగా ఉండండి.

సింహం – పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి అధికంగా శ్రమిస్తారు. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి.

కన్య –  క్రయవిక్రయాలలో స్వల్ప లాభ సూచన. ఆర్థిక విషయాలలో మెలకువలు అవసరం విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

తుల – సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని లాభపడగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే సూచన. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా శుభవార్తను వినగలుగుతారు.

వృశ్చికం – చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన బదిలీ లభించే సూచనలు ఉన్నాయి. మిత్ర వర్గం ఆత్మీయ వర్గం అన్ని విధాల సహకరిస్తారు.

ధనుస్సు – ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. రుణాలు చేయనంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏవి ఏర్పడవు వివాదాలను పరిష్కరించుకోవడానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు.

మకరం – వ్యక్తిగత హోదా పెంపొందుతుంది. అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. రహస్య ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి.

కుంభం – ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. దూరప్రాంత ప్రయాణాలను గ్రహ స్థితి సూచిస్తుంది. వృత్తి వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మీనం – కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News