Thursday, September 18, 2025

పాపం పసికందు

- Advertisement -
- Advertisement -
  • అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  • కలబ్‌గూర్‌లో దారుణం

సంగారెడ్డి: అప్పు డే పుట్టిన ఆడశిశువును గ్రా మ పంచాయతీ కార్యాలయం ఎదుట వదిలేసిన అమానవీయ సంఘటన సంగారెడ్డి మండల పరిధిలోని కలబ్‌గూర్ గ్రామ పంచాయతీ ఎదుట చోటుచేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన కథనం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కలబ్‌గూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లిందన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మంజుల ఆమె భర్త పండరి నాథ్‌గౌడ్‌లు పాపను చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాపను సర్పంచ్ పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాపను స్పెషల్ న్యూబార్ప్‌కేర్ యూనిట్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. శిశువు ఎవరు, శిశువును ఎవరు వదిలి వెళ్లారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News