Thursday, May 22, 2025

పాకిస్తాన్ లో సింధు జల పోరాటం

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ సైన్యం సింధు కాలువల ప్రాంతాన్ని యుద్ధ భూమిగా మార్చింది. పాకిస్తాన్ సైన్యం ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సింధు కాలువల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఒక దశలో నిరసనలు దౌర్జన్య పూరితంగా మారాయి. ఆగ్రహోదగ్రులైన ప్రజలు ఒక ఆయిల్ టాంకర్ కు, ఓమంత్రి ఇంటికి నిప్పుపెట్టారు. నిరసన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. ఉత్తర సింధ్ వర్చువల్ యుద్ధ భూమిగా మారిపోయింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో , ఆయన పార్టీని సింధీ ప్రజలు దుమ్మెత్తి పోశారు. తమ కష్టాలకు పంజాబ్ ఆధిపత్యమే కారణమని నిందించారు. చాలా కాలంగా సింధు నది వ్యవస్థపై విరసన వ్యక్తమవుతోంది. సైన్యం మద్దతుతో చేపట్టిన కాలువ ప్రాజెక్టును సింధు ప్రావిన్స్ లోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళన సాగిస్తున్నారు.

ఆ ఆందోళన కొత్త ఊపు అందుకుంది. గత నెలలో ఈ ప్రాజెక్టును నిలిపివేసిన ప్రభుత్వం మళ్లీ మొదలు పెట్టడంతో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో హింసాకాండ కా దారితీసింది. , పోలీసులు ఇద్దరిని కాల్చిచంపారు. నిరసన కారులు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మంత్రి ఇంటిపై దాడి చేశారు.పాకిస్తాన్ లోని నాలుగు ప్రావిన్స్ లలో సింధ్, పంజాబ్ కీలకమైనవి. అధికార, సైనిక సంస్థల శక్తి కేంద్రాలు. పంజాబ్ ఆధిపత్యం పెచ్చుపెరుగుతోందని సింధ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సింధ్ కు చెందిన పీపీపీ షాబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. సింధ్ ప్రావిన్స్ లోనూ అధికారంలో ఉంది.సింధీ జాతీయవాద పార్టీ జీ సింధ్ ముత్తహిదా మహాజ్ (జెఎస్‌ఎంఎం) సింధ్ కాలువ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News