- Advertisement -
మనతెలంగాణ/కాసిపేటః సింగరేణి సంస్థ ఆద్వర్యంలో సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో ఈనెల 17వ తేదిన ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ విశ్వనాథ మహార్షి(మాతా రిసెర్చ్ ఇన్సిట్యూట్ ఆఫ్ హయుర్వేద హైద్రాబాద్) ఆద్వర్యంలో ఆయుర్వేద వైద్య శిభిరం సింగరేణి సంస్థ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని యాజమాన్యం ప్రకటనలో పేర్కొన్నారు. 17వ తేది ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందమర్రి లోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో ఉచిత ఆయుర్వేద శిభిరం నిర్వహించడం జరుగుతుందని, వైద్య శిభిరానికి ఇంతకు ముందు హాజరు అయిన వారితో పాటు నూతనంగా వైద్యం కొరకు వచ్చే వారు ఈ అవకాశం ను ఉపయోగించుకోవాలని సంస్థ పేర్కొంది.
- Advertisement -