శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని అరాచక శక్తులను ఇప్పటికే ఏరివేయ డం జరిగిందని, ఇంకా ఇటువంటి అవినీతి దందా నడిపే వారికి సంబంధించిన, వెనక ఉండి నడిపిస్తు న్న వారి సమాచారం తెలియజేస్తే వారిని కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తామని సింగరేణి యాజమా న్యం బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మెడికల్ బోర్డు ప్రక్రియలో అన్ ఫిట్ చేయిస్తామని, బదిలీలు జరిపిస్తామని, కొత్తగా ఉద్యోగాలకు ఎం పికైన వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని, డిప్యూటేషన్లు, ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పా ల్పడుతున్న సింగరేణి ఉద్యోగిని ఈ నెల 6 మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరె స్టు చేసిన నేపథ్యంలో సంస్థ ఈ ప్రకటన జారీ చే సింది. అమాయకులైన కార్మికులను వంచిస్తున్న ఎ వరినైనా సరే సంస్థ ఉపేక్షించబోదని, కఠిన చర్య లు ఉంటాయని స్పష్టం చేసింది.
అవినీతి చర్యలకు పాల్పడే వారిని, వారికి వెనుక ఉండి సహకారం అందించే వారిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం హెచ్చరించింది. అవినీతికి బలైన బాధితులు, లేదా దీనిపై సమాచారం ఉన్న ఏ ఇతర కార్మికులైన మరియు ఇతరులైన సరే సింగరేణి విజిలెన్స్ శాఖకు తెలియజేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచడమే కాక వారి కి సంస్థ పూర్తి రక్షణ కల్పిస్తుందని యాజమాన్యం పేర్కొంది. అలాగే సింగరేణి సంస్థ లో వివిధ ప నులు చేయిస్తామని పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి వివరాలు, ఆధారాలు ఇచ్చిన వారికి రూ.10 వేల పారితోషకం కూడా ఇవ్వనున్నట్లు పు నరుద్ఘాటించింది. అవినీతిని, అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించడానికి, సదరు వ్యక్తులను కటకటాల వెనక్కి నెట్టడానికి సింగరేణి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని తెలిపింది. సంస్థ పట్ల బాధ్యత గల కార్మికులు ఇందుకు సహకరించాలని, సమాచారం అందించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసిం ది. అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎవరై నా సరే, ఏ హోదాలో ఉన్న వదిలిపెట్టేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.