Friday, June 27, 2025

సెల్ఫీల కోసం ఫ్యాన్స్ అత్యుత్సాహం.. సింగర్ చిత్రకు తీవ్ర గాయం..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ గాయనీ కెఎస్ చిత్ర (Singer Chitra) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్ధాలుగా ఆయన తన గాత్రంతో శ్రోతలను అలరిస్తున్నారు. అయితే చిత్రకు గాయమైందని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మలయాళం స్టార్ సింగర్ 10వ సీజన్‌లో జడ్జిగా హాజరైన ఆమె చేతికి కట్టుతో కనిపించారు. చెన్నై విమానాశ్రయంలో తనకు గాయమైనట్లు చిత్ర వెల్లడించారు.

హైదరాబాద్‌కు వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్కింగ్ పూర్తి చేసుకొని చిత్ర (Singer Chitra) తన భర్త కోసం ఎదురు చూస్తుండగా అభిమానులు పోటీపడ్డారని చిత్ర తెలిపారు. అయితే తన వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉందట. అయితే ఫోటోలు దిగే ఉత్సాహంలో అభిమానులు చిత్రను వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగిన తర్వాత చిత్ర వెనక్కి తిరిగి ఒక అడుగు వేయగానే ట్రే తగిలి కింద పడిపోనని ఆమె పేర్కొన్నారు.

దీంతో ఆమె భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగిందని.. డాక్టర్లు దాన్ని సరి చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత చిత్రను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని.. మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారట. ఇది తెలిసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News