Saturday, May 17, 2025

క్యాన్సర్‌తో పోరాడుతూ.. ప్రముఖ గాయనీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

గౌహతి: అస్సామీ (Assam) సంగీత ప్రేమికులకు ఇది నిజంగా ఓ చేధు వార్త. ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారికా(44) (Gayatri Hazarika) శుక్రవారం కన్నుమూశారు. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో ఆమె బాధపడుతున్నారు. గౌహతిలోని నేమ్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ‘సరా పాటే పాటే నామే’, ‘జోనాక్ నాశిల్ బనత్’, ‘ఆబేలిర్ హెంగులీ ఆకాశే’ తదితర పాటలతో ఆమె అస్సామీ సంగీత రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హజారికా మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు అని ఆయన అన్నారు. గాయత్రి హజారికా మృతి పట్ల పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News