కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ బ్యా నర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీల క పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు ద ర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలమ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సింగిల్ సినిమా మే 9న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా హీ రోయిన్ కేతిక శర్మ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో పూర్వా అనే క్యారెక్టర్ లో కనిపిస్తా ను. ఈ కథలో ఎమోషన్ నా క్యారెక్టర్ ద్వారానే వస్తుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎం టర్‌టైనర్. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. -శ్రీ విష్ణు కామెడీ టైమిం గ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఇవానా వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఆన్ స్క్రీన్ లో మా మధ్య ఒకటి రెండు సీన్స్ ఉన్నాయి.
డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సి నిమాని హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీగా తీర్చిదిద్దా రు. కామెడీ చేయడం అంత సులభం కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ప్రేక్షకులకి కావలసిన నవ్వు లు పంచే సినిమా ఇది. ‘సింగిల్‘ నాకు స్పెషల్ మూవీ. ఇక ప్రస్తుతం -హిందీలో ఒ క సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్, తెలుగు బై లింగ్వల్ ఒకటి చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి”అని అన్నారు.