Tuesday, May 6, 2025

ఫన్‌తో పాటు మంచి ఎమోషన్ ఉన్న మూవీ

- Advertisement -
- Advertisement -

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ బ్యానర్‌లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలమ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సింగిల్ మూవీ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన్ని ఒక విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో ఆడియన్స్ చూస్తారు. సినిమా ఫుల్ ఫన్ మూడ్‌లో ఉంటుంది.

-అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. 90 శాతం కథలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరి ఫన్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్లు -ఇవానా, కేతిక ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్. ఈ కథలో ఇద్దరి క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయి. -గీతా ఆర్ట్‌లో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాకి కావలసిన ప్రతీది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రాజెక్టుని చేశాం. -విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో పాటలన్నీ కథకు తగ్గట్టుగానే ఉంటాయి. ఆడియన్స్ సాంగ్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ సెంటిమెంటల్ స్టోరీ. ఇందులో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది. రాజేంద్రప్రసాద్‌తో వచ్చే సీక్వెన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News