- Advertisement -
అమరావతి: సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సర్ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబిఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారని ప్రశంసించారు. రాజమహేంద్రవరంలో 1852లో గోదావరి నదిపై ధవలేశ్వరం బ్రిడ్జిని ఇంజినీర్ సర్ అర్థర్ కాటన్ నిర్మించారు.
- Advertisement -