Wednesday, July 23, 2025

నాకు ఆందోళన లేదు.. నేను ఆరోగ్యంగా ఉన్నా: సిరాజ్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) మంచి ఫామ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట విశ్రాంతి ఇస్తున్నట్లు సిరాజ్‌కి కూడా ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. వాటి నాలుగో టెస్ట్‌కి ముందు సిరాజ్ స్పందించాడు.

ఇప్పటివరకూ మూడు టెస్టుల్లో కలిసి సిరాజ్ (Mohammad Siraj) 109 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా రెండు టెస్టుల్లో 87, ఆకాశ్‌దీప్ 72, ప్రసిద్ధ్ 62 ఓవర్లు వేశారు. అయితే దీనిపై సిరాజ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను ఫిట్‌గానే ఉన్నానని.. చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు. ‘‘ప్రస్తుత మోడ్రన్ క్రికెట్‌లో వర్క్‌లోడ్ భాగమే. ఎన్ని ఓవర్లు వేస్తున్నామనేది డేటా చెబుతుంది. నేను ఎన్ని ఓవర్లు వేశానో తెలుస్తుంది. కానీ, దాని గురించి నేనేమీ ఆందోళన చెందడం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత విజయంలో కీలక పాత్ర పోషించడంపైనే దృష్టి పెడతా’’ అని సిరాజ్ అన్నాడు.

ఇక వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడమని భారత ఛాంపియన్స్ జట్టు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ని రద్దు చేసిన నిర్వాహకులు ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడేది లేదని భారత మాజీలు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సిరాజ్‌ను ప్రశ్నించగా.. దాని గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదని అన్నాడు. ‘‘అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియదు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News