మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం మహ్మద్ సి రాజ్, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిల మధ్య ప్రత్యేక అనుబంధం ఉ న్న సంగతిఅందరికి తెలిసిందే. సిరాజ్ ను మెరుగైన బౌలర్‌గా తీర్చిదిద్దడంలో కోహ్లి పాత్ర చాలా కీలకమని చెప్పాలి. కోహ్లి సారథ్యంలో సిరాజ్ చాలా ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. కోహ్లి అండతోనే సిరాజ్ ఈ స్థాయికి చేరాడనంలో ఎలాంటి సందేహం లేదు. సిరాజ్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఘనత కోహ్లికి మాత్రమే దక్కుతుందని చెప్పక తప్పదు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో సిరా జ్ అసాధారణ బౌలింగ్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టిన విషయం విదితమే. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదిక గా సిరాజ్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. దీ నికి సిరాజ్ తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లికి కృతజ్ఞత లు కూడా తెలిపాడు. కాగా, కోహ్లి తన శిష్యుడు సిరాజ్‌కు అరుదైన బహుమతిని కానుకగా ఇచ్చా డు. దాన్ని సిరాజ్ తన ఇంటిలో పదిలంగా దాచుకున్నాడు. కోహ్లి తన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడిన జెర్సీని సిరాజ్‌కు కానుకగా బహుకరించాడు. ఈ జెర్సీని సిరాజ్ ఇంట్లో తీపి జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
విరాట్ జెర్సీని పదిలంగా దాచుకున్న సిరాజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -