Tuesday, July 29, 2025

ఆ వ్యాధి తెలిస్తే పరువు పోతుందని… తమ్ముడిని చంపిన అక్క

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తమ్ముడికి వచ్చిన హెచ్ఐవి వ్యాధి బయట తెలిస్తే పరువు పోతుందని అతడిని అక్క చంపేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా హొళల్కెర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దుమ్మి గ్రామంలో నాగరాజు అనే వ్యక్తికి కుమారుడు మల్లికార్జున, కూతురు నిశా ఉన్నారు. మంజునాథ్ అనే యువకుడితో నిశా పెళ్లి చేశాడు. మల్లికార్జున అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరు నుంచి దుమ్మికి కారులో మల్లికార్జున వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. మల్లికార్జున తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

మల్లికార్జునకు రక్ష పరీక్షలు చేయగా హెచ్ఐవి వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి అతడికి తెలిపాడు. తనకు హెచ్ఐవి వ్యాధి సోకిందని అక్కకు తమ్ముడు తన బాధను తెలిపాడు. మెరుగైన చికిత్స కోసం కారులో అక్క, బావతో ముంబయికి వెళ్తున్నాడు. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, జీవించడానికి ఆసక్తి లేదని అక్కతో చెప్పుకొని తమ్ముడు కన్నీంటిపర్యంతమయ్యాడు. తమ్ముడికి వచ్చిన వ్యాధి బయటకు తెలిస్తే తమ కుటుంబం పరువుపోతుందని అక్క భావించింది. అక్క తన భర్తతో కలిసి తమ్ముడి గొంతుకు టవల్ బిగించి చంపేశారు. అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కుమారుడిపై గొంతుపై గాయాలు కనిపించడంతో తండ్రి నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేస నమోదు చేసి అక్కను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News