Friday, July 25, 2025

సుబ్రహ్మణ్యం హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

రాజమహేంద్రవరం: అనంతబాబు మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముఖ్య సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కాకినాడకు చెందిన దళిత యువకుడు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత విచారణలో లోపాలు తెలుసుకుని తొంభై రోజులు విచారణ పరిపూర్ణం చేయాలని సిట్ ప్రయత్నిస్తోంది. ఈ కేసు విషయంలో న్యాయ సలహా దారుగా ముప్పాళ్ల సుబ్బారావుని ప్రభుత్వం ఎన్నుకుంది. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు గన్ మెన్లను సిట్ విచారించింది. సుబ్రమణ్యం సోదరుడికి 2 ఎకరాల సాగుభూమి, 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడానికి సర్కార్ అనుమతించింది. సోషల్ వెల్ ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం లభించింది. ఇంకో పక్క ఆ యువకుని కుటుంబానికి నష్ట పరిహారంగా డబ్బు సహాయం ఎపి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News