Monday, May 12, 2025

సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రాచారం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టుకు జలవనరుల సంఘం అనుమతులు ఉన్నాయని బిఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీతారామ ప్రాజెక్టు పై కాంగ్రెస్ దుష్ప్రాచారం చేస్తుందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిఆర్ ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేశామని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News