- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిగిలి గ్రామంలో నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులంతా ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ గంగాదర్ అక్కడికి చేరుకొని ఆరుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. తహసీల్దార్, ఆర్ డిఒ భరత్ నాయక్ మృతదేహాలను పరిశీలించారు. నీటికుంటలో చిన్నారుల మృతదేహలను తల్లిదండ్రులు బయటకు తీసి ఇంటికి చేర్చుకున్నారు.
- Advertisement -