Sunday, September 7, 2025

కార్గో రోప్‌వే తెగి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలో శక్తిపీఠమైన పావగఢ్ కొండ ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం గూడ్స్ రోప్‌వే వైర్ తెగి ఆరుగురు మృతి చెందారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు ఉన్నట్టు కలెక్టర్ చెప్పారు. పాపగఢ్ ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంది. 2000 మెట్లు ఎక్కడం లేదా కేబుల్ కార్ల ద్వారా భక్తులు, యాత్రికులు శిఖరానికి చేరుకోవడం పరిపాటి. అయితే శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఉపయోగించే రోప్‌వేను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News