Saturday, May 24, 2025

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఎపిలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద లారీని, కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. బాపట్ల జిల్లా స్టువర్టుపురం గ్రామానికి చెందిన కుటుంబం విహారయాత్ర కోసం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను గజ్జల అంకాలు (50), గజ్జల జనార్ధన్, గజ్జల భవాని(20), గజ్జల నరసింహ(20), సన్నీగా గుర్తించారు. మరొకరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. గాయపడిన వారిలో జీతన్, శిరీష ఉన్నారు.

వారంతా బాపట్ల జిల్లా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రమాద సమయానికి ముందు కారు, లారీలు రెండు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని అందుకే ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు వెల్లడించారు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి.. సమీపంలోని పెట్రోల్ బంక్‌లోని సిసి కెమెరాలో రికార్డు అయిందని తెలిపారు

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
రోడ్డు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహానంది వెళ్లొస్తున్న ఆరుగురు మృతి బాధాకరమన్నారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ప్రమాదానికి గల కారణాలను అధికారు లను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News