హైదరాబాద్: నగరంలోని ఓ ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది. హబీబ్‌నగర్ పిఎస్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ (Nampally) ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ పరిశీలించారు. ఆ ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది.
అయితే ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని.. యజమానులు విదేశాల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్ ఘటనస్థలిలో (Nampally) ఆధారాలు సేకరించింది. ఇటీవల ఓ యువకుడు శిథిలావస్థలో ఉన్న ఆ ఇంట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. లోపల ఉన్న అస్థిపంజరాన్ని ఆ యువకుడు వీడియో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. పోలీసులు సదురు యువకుడిని విచారించగా.. క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లానని తెలిపినట్లు సమాచారం.