Wednesday, July 9, 2025

శాంటో, రహీం అజేయ శతకాలు

- Advertisement -
- Advertisement -

గాలే: బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మంగళవారం గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 202527 సైకిల్‌కు తెరలేచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, మాజీ కెప్టెన్ ముష్ఫికుర్ రహీం అజేయ శతకాలతో కదంతొక్కారు. దీంతో బంగ్లాదేశ్ తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.

ఓపెనర్ అనముల్ హక్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ షద్మన్ ఇస్లాం (14) కూ డా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మాజీ సారథి మోమినుల్ హక్ (29) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగులకే మూ డు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఈ దశలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, సీనియర్ బ్యాటర్ రహీం అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు లం క బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నజ్ముల్ 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 136 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రహీం 186 బంతుల్లో ఐదు ఫోర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు అజేయంగా 242 పరుగులు జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News