- Advertisement -
న్యూఢిల్లీ : వాహన రిశ్రమపై జిఎస్టి రేట్ల తగ్గింపు వల్ల చిన్న కారు ధరలు రూ.1 లక్ష వరకు తగ్గే అవకాశముంది. దీంతో రాబోయే పండుగ సీజన్లో ప్రత్యేకించి చిన్న నగరాలు, పట్టణాల్లో డిమాండ్ గణనీయంగా పెరగనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జిఎస్టి సరళతరం చేయడంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో డిమాండ్ పునరుద్ధరణ అంచనా వేస్తున్నారు. దీంతో క్రమంగా దేశీయ ప్రయాణికుల వాహన మార్కెట్లో పట్టు తగ్గే అవకాశముంది. 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల మొత్తం విక్రయాల వాటా 31 శాతం ఉండగా, 2025 ఏప్రిల్జులై కాలంలో ఇది 27 శాతానికి పడిపోయింది.
- Advertisement -