- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్‌లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడింది. తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం అయింది. తాజాగా దక్షిణ భారతదేశంలో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్‌లను ఉత్తర భారత దేశానికి(IPL Venues) తరలించారు. బెంగళూరులో వర్షం కారణంగా ఐపిఎల్ వేదికల్లో ఈ నెల 23న ఆర్‌సిబి-సన్‌రైజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ బెంగళూరు నుంచి లక్నోకి తరలించారు.
అంతేకాక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో కూడా లక్నోలోనే ఆర్‌సిబి తలపడనుంది. ఇక ముల్లాన్‌పూర్‌లో మే 29 క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్ మ్యాచులు.. ఆహ్మదాబాద్ (IPL Venues) వేదికగా.. జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచులు జరుగుతాయి. ఇక జూన్ 3న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యమివ్వనుంది.
- Advertisement -