Wednesday, June 18, 2025

ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా స్మృతి మంధాన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచింది. తాజాగా ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆరు సంవత్సరాల తర్వాత మంధాన తిరిగి తన అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ ఫైనల్‌ మ్యాచ్‌లో మంధాన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కొన్ని మ్యాచ్ లే ఆడినా అద్భుత ఫామ్ తో పరుగులు సాధించింది మంధాన. ఈక్రమంలోనే ఆమె వన్డేలో మళ్లీ నంబర్ స్థానానికి చేరుకుంది. ఇక, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ రెండవ స్థానానికి పడిపోయింది. ఆమెతోపాటు నాట్ స్కైవర్ బ్రంట్‌ కూడా రెండో స్థానంలో నిలిచింది. మంధాన 727 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా.. వోల్వార్డ్ట్, స్కైవర్-బ్రంట్ సంయుక్తంగా 719 రేటింగ్‌లను కలిగి ఉన్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ 689 రేటింగ్‌లతో నాల్గవ స్థానం, ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ 684 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు.

అలాగే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సోఫీ ఎక్లెస్టోన్ 747 రేటింగ్‌లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆష్ గార్డ్నర్ (724), మేగాన్ షుట్ (696), దీప్తి శర్మ (672) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. మారిజాన్ కాప్ నాలుగు స్థానాలు దిగజారి ఐదో స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. కిమ్ గార్త్, అలానా కింగ్, కేట్ క్రాస్, హేలీ మాథ్యూస్ ఒక్కొక్కరు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు.

ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టాప్ 10లో ఎటువంటి మార్పు లేదు. యాష్ గార్డ్నర్ 470 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ రెండవ స్థానంలో (432), మారిజాన్ కాప్ (391) మూడవ స్థానంలో, దీప్తి శర్మ (353) నాల్గవ స్థానంలో, అమేలియా కెర్ (338) ఐదవ స్థానంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News