ముల్లాన్‌పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 77 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి భారత తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో మొదటి స్థానంలో కూడా స్మృతినే ఉండటం విశేషం. ఈ ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. తాజాగా ఇది స్మృతి 12వ శతకం. ఈ శతకంతో ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్‌గా సూజీ బేట్స్ (న్యూజిలాండ్), ట్యామీ బేమౌంట్ (ఇంగ్లండ్)ల సరసన స్మృతి నిలిచింది. ఈ ముగ్గురు 12 శతకాలు సాధించారు.
అయితే బేట్స్, బేమౌంట్ కంటే స్మృతి (Smriti Mandhana) వేగంగా ఈ రికార్డును అందుకుంది. బేట్స్‌కు ఈ రికార్డు సాధించేందుకు 130 ఇన్నింగ్స్ అవసరం కాగా, బేమౌంట్ 113 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించింది. కానీ, స్మృతి కేవలం 106 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్మృతి అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియాపై రికార్డు స్కోర్ సమోదు చేసింది. 49.5 బంతుల్లో 292 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ మహిళ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఇంగ్లండ్ ఉంది. 2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, ఆసీస్‌పై 298 పరుగులు చేసింది.
Also Read : ఐసిసి మహిళల ర్యాంకింగ్స్.. మంధానకు అగ్రస్థానం