Thursday, July 3, 2025

విమానం కార్గోలో విషపూరితమైన పాము.. ఆరగంట పాటు శ్రమించి..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాలో విషపూరితమైన పాము (Snake) విమానంలోకి దూరంది. మెల్‌బోర్న్ నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే వర్జిన్ ఆస్ట్రేలియా విఎ337 విమానం కార్గోలో ఈ సర్పాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్ మార్క్ పెల్లీ రంగంలోకి దిగి అరగంట పాటు శ్రమించి పాముని పట్టుకున్నారు. పాము 60 సెంటి మీటర్ల పొడవు గల గ్రీన్ ట్రీ స్నేక్‌గా గుర్తించారు. ‘‘తొలుత అది మాములు పాము అని అనుకున్నా.. కానీ, అది భయంకరమైన విషపూరిత సర్పం అని పట్టుకున్నాక తెలిసింది’’ అని పెల్లీ వెల్లడించారు. మొదటి ప్రయత్నంలోనే పాముని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరైన ప్రయాణికుడి లగేజీలో ఉండి.. పాము విమానంలో దూరినట్లు అంచనా వేస్తున్నారు. పాము విమానంలో దూరిన కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News