Saturday, May 17, 2025

తడిసిన ధాన్యం కొంటాం

- Advertisement -
- Advertisement -

అన్నదాతలు ఆందోళన చెందొద్దు రైతు
సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ధాన్యం
కొనుగోలు ప్రక్రియను కలెక్టర్లు స్వయంగా
పర్యవేక్షించాలి యాసంగిలో రికార్డుస్థాయిలో
ధాన్యం దిగుబడి 60.14లక్షల ఎకరాల్లో
వరిసాగు 129.35లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం దిగుబడి అంచనా 70.13లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్షం ఇప్పటికే
50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో
కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగిలోనూ ధా న్యం దిగుబడి రికార్డు స్థాయిలో ఉందని పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్ర వారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పురోగతిపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొ న్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి. ఎస్.చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ యాసంగి లోనూ రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని, 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయ్యిందని, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యాసంగిలో 70.13 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ లక్ష్యం పె ట్టుకోగా ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2023 రబీ సీజన్ లో మే15వ తేదీ నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈసారి రబీ సీజన్ లో అదే మే 15వ తేదీ నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగడం విశేషమన్నారు.

ముందెన్నడూ లేని రీతిలోపెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 8,348 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నయన్నారు. 2021–22 రబీ సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్ లో అధికంగా1,739 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ఈఏడాది ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తడిసిన ధాన్యాన్ని సైతం రైతుల నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు, కొనుగోలు ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న 10,12 రోజులు కొనుగోలు ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లయితే వాటిని సత్వరమే పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, కొందరు ఉద్దేశ్యపూర్వకంగా రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News