Monday, July 21, 2025

చిన్నారులను బానిసలుగా మార్చేలా సోషల్ మీడియా: మస్క్

- Advertisement -
- Advertisement -

పిల్లలు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని నియంత్రించాలని ఎలాన్ మస్క్ సూచించారు. వివా టెక్నాలజీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మస్క్ ఈ సూచన చేశారు. సంతోషాన్ని పెంచే డొపమైన్ అనే హార్మోన్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యేలా ఎఐ(కృత్రిమమేధ) సహకారంతో ప్రోగ్రాములు చేస్తూ చిన్నారులు అధిక సమయం గడిపేలా సోషల్ మీడియాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని తల్లిదండ్రులు నియంత్రించాలని సూచించారు. మరోసోషల్ మీడియా పోస్టులో మస్క్ స్పందిస్తూ ‘ ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులను బానిసలుగా మల్చుకునేలా డొపమైన్ ఉత్పత్తిని పెంచేట్లు రూపొందించారు. ఇవి చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. వివా టెక్నాలజీస్‌లో మాట్లాడిన దాన్ని ఆయన రీపోస్టు చేశారు. అయితే మస్క్ స్వయంగా సామాజిక మాధ్యమం ‘ ఎక్స్’కు అధినేత కావడం గమనార్హం.

పిల్లల కోసం బేబీ గ్రోక్
కాగా పిల్లల కోసం ఎఐ యాప్‌ను లాంచ్ చేయబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. దానిని ఆయన బేబీ గ్రోక్‌గా అభివర్ణించారు.ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News