న్యూఢిల్లీ : సామాజిక వ్యవహారశైలిలో కొట్టోచ్చే మార్పు చోటు చేసుకుంది. ఈ క్రమంలో పౌరులు అత్యధిక సంఖ్యలో ఎక్కడా సత్యం వైపు (society cannot tell truth) నిలబడటం లేదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇప్పటి సత్యం అయితే ఇది ఆవేదనాయుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2017 లో జరిగిన భివాండి కార్పొరేటర్ (కాంగ్రెస్) మనోజ్ మహత్రే హత్యోదంతంలో కేసువిచారణ క్రమంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అప్పటి హత్య ఘటనలో పలువురి వాంగ్మూలాలు ఇతరత్రా ఆధారాలు ఉన్నప్పటికీ , వేరే ఆధారాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటోందని ప్రశ్నించారు.
హత్యకేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ భాస్కర్ మహత్రే బెయిల్ దరఖాస్తు విచారణ క్రమంలో న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం స్పందించింది. ఈరోజుల్లో ఎవరు కూడా నిజాలను చెప్పేందుకు ముందుకు రావడం లేదని, భయాలతో సామాజిక విలువలు (society cannot tell truth) అడుగంటుతున్నాయని, ఈ కేసు క్రమంలో సాక్షులను బెదిరించే తంతు సాగుతోందని, అయితే విలువల క్షీణత నేపథ్యంలో సత్యం మరుగునపడుతోందన్నారు.