Wednesday, September 3, 2025

విద్యుత్ స్తంభం విరిగిపడి బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

- Advertisement -
- Advertisement -

ఉద్యోగం ముగించుకొని ఇంటికి వస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పైన స్తంభం పడి, అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో వియస్‌టీ కాలనీకి చెందిన గణపయ్య నిమజ్జన ఊరేగింపు నాచారం క్రాస్ రోడ్డు వరకు చేరుకుంది. గణపయ్య ఎత్తు 16 ఫీట్లు ఉండడంతో రోడ్డు పైన ఉన్న కేబుల్ వైర్‌తో విగ్రహం ఒక పక్క గా జరగడంతో కేబుల్ వైర్‌తోపాటు రోడ్డు మధ్యన ఉన్న తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగినట్టుగా తెలిపారు. విరిగిన స్తంభం ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కార్తికేయనగర్‌కు చెందిన బాగుదం సాత్విక్ (23) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తలపై పడడంతో తలకి తీవ్ర గాయాలైనట్టు నాచారం పోలీసులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన వినాయక ఊరేగింపు వాహన డ్రైవర్ కోరాడ ఏడుకొండల్‌ని, గణేష్ మండపం ఆర్గనైజర్ వెంకటేశ్‌ను, అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News