Tuesday, July 8, 2025

బెట్టింగ్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః బెట్టింగ్ కట్టి అప్పులు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేకున్నాడు. ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వీరవల్లి పవన్‌కుమార్(24) బేగంపేటలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్‌కుమార్ బెట్టింగ్‌కు బానిసగా మారాడు. తెలిసిన వారి వద్ద, లోన్ యాప్‌ల్లో అప్పులు చేసి బెట్టింగ్ కట్టేవాడు. అప్పులు ఎక్కువ చేయడంతో కొన్నింటిని యువకుడి తండ్రి తీర్చాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆదివారం ఉదయం బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News