Wednesday, April 30, 2025

10లక్షల ఇళ్లకు సౌరకాంతులు

- Advertisement -
- Advertisement -

దేశంలోని లక్షలాది కుటుంబాలకు
ఉచిత సౌరశక్తి అక్టోబర్ నాటికి
ఈ సంఖ్యను 20 లక్షలకు
పెంచాలని లక్ష్యం 2027 మార్చి
నాటికి కోటి ఇళ్లకు సౌరశక్తి సరఫరా
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్
బిజ్లి యోజనతో ప్రయోజనం
మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో పునరుత్పాదక ఇంధన విభాగంలో విప్లవాత్మక మార్పు ను తెసూ, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఉచి త సౌరశక్తిని అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ చొరవగా పేరుగాంచిన ఈ పథకం ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సో లార్ ఎనర్జీ అందించింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి నాటికి కో టి ఇళ్లకు సౌరశక్తిని సరఫరా చేయాలనే ఉద్దేశం తో ఈ స్కీం ముందుకు సాగుతోంది. పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన ప్రకారం ఈ స్కీం ద్వారా ఇప్పటివరకు 1 మిలియన్ ఇళ్లకు పైగా సౌరశక్తిని అందించారు.

ఇది భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకునేందుకు చాలా కీలకమైన ముందడుగని చెప్పవచ్చు.గృహ యజమానులకు సౌర ఫలకాలను అమర్చుకోవడానికి 40శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75% సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీక త్తు లేకుండా రుణాలను అందిస్తున్నాయి. రూ. 78వేల వరకు సబ్సిడీ లభించనుంది. సంవత్సరానికి కేవలం 6.75శాతం వడ్డీ రేటుతో రూ. 6 ల క్షల వరకు రుణం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రూ.2 లక్షల వరకు రుణాలకు ఎలాంటి ఆదాయ పత్రాలు అవసరం లేదు. మొత్తం ఖర్చులో 90 శా తం వరకు బ్యాంకు ఫైనాన్స్ సదుపాయం ఉం టుంది. దరఖాస్తు దారుడు తప్పనిసరిగా భారతీ య పౌరుడై ఉండాలి.

సౌర ఫలకాలను అమర్చడానికి అనువైన పైకప్పు గల ఇంటి యజమానిగా ఉండాలి. ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి. ఇంతకు ముందు ఎలాంటి ఇతర ప్రభుత్వ సబ్సిడీని పొందకూడదు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజనకు దరఖాస్తు కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https:// pmsuryaghar.gov.in/ను సందర్శించాలి. వినియోగదారుల ట్యాబ్‌లో‘ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. (లేదా) ‘కన్స్యూమర్ లాగిన్‘ పై క్లిక్ చేసి మీ మొబైల్ నం బర్‌ను నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. మీ పేరు, రాష్ట్రం, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఇమెయిల్ ఐడీ ధృవీకరించిన అనంతరం మీరు అవసరమైతే విక్రేత ఎంపికకు అవును లేదా కాదు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

సోలార్ రూఫ్‌టాప్ కోసం దరఖాస్తు చేసుకోండి పై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇత ర వివరాలను నమోదు చేయాలి. సాధ్యాసాధ్య అంగీకారాన్ని పొందిన తర్వాత, విక్రేతను ఎంపి క చేసుకుని మీ బ్యాంక్ వివరాలను సమర్పించా లి. ఆపై మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను అమర్చుకోవచ్చు. ఈ పథకం ప్రధానం గా దేశంలోని మధ్య తరగతి కుటుంబాలకు త క్కువ ఖర్చుతో విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీని వల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు, దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News