నీటిపారుదల శాఖ భూముల్లో
సౌర విద్యుత్ ప్లాంట్లు భూముల
పరిరక్షణకు తక్షణమే చర్యలు
వాలంతరి, టి.జి.ఇ.ఆర్.ఎల్
భూముల్లో ఆక్రమణల తొలగింపు
హైడ్రా, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో
నీటిపారుదశాల మంత్రి
ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తం గా నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావే శంలో కూడా ఈ అంశంపై చర్చించినట్లు నీటిపారుదల శాఖ లమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో నీ టిపారుదల శాఖ భూములు, వాటి ఆక్రమణల అంశంపై నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్,ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) అంజద్ హుస్సేన్, ఇంజినీర్ ఇన్ చీఫ్(అడ్మినిస్ట్రేషన్) రమేష్ బాబు, వాలంతరి డైరెక్టర్ జెనరల్ అనిత, హైడ్రా ఎస్పీ అశోక్ తదితరులతో మంత్రి ఉత్తమ్ సమావేశాన్ని నిర్వహించారు.
భూములకు కంచె ఏర్పాట్లు
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న భూముల పరిరక్షణకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అన్యాక్రాంతం అయిన భూములను యుద్దప్రాతిపదికన స్వాధీనం చేసుకుని వాటి చుట్టూ కంచె నిర్మాణాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న భూములను న్యాయస్థానాల్లో గెలిచేందుకు ప్రత్యేక సీనియర్ న్యాయవాది నియామకం చేస్తామన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఎంతో వి లువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్‌భూముల్లో ఉ న్న ఆక్రమణలను తొలగించేందుకు కార్యచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
రాజేంద్రనగర్‌లో భూఆక్రమణలు
రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న గండిపేట సమీపంలోని హిమాయత్ సాగర్, కిస్మత్ పుర, రాజేంద్రనగర్ పరిధిలోని వాలంతరి, టిజిఇఆర్ ఎల్‌కు చెందిన 42,6-30 ఎకరాలకు గాను 13,1-31ఎకరాలు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందన్నారు. అందులో ఐ.టి.ఐ.ఆర్ అధీనం లో ఉన్న 81.26 ఎకరాల అంశం కోర్టు పరిధిలో ఉండగా, మరో50.13 ఎకరాలు ఆక్రమణకు గురైందని మంత్రి అధికారులకు వివరించారు.ఈ ఆక్రమణ లపై జిల్లా కోర్టులో 20 కే సులు పెండింగ్ లో ఉండగా, హైకోర్టు పరిధిలో మరో రెండు కేసులు నడుస్తున్నాయన్నారు. భూ ములను పరిరక్షించేందుకు నీటిపారుదల శాఖ పరంగా ప్రత్యేక సీనియర్ న్యాయవాదిని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు.