హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘‘హరిహర వీరమల్లు’’ (Hari Hara Veera Mallu). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదన సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రధానంగా సెకండ్ హాప్ అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ షాకింగ్ న్యూస్ అందించింది.
దీంతో సినిమాలోని కొన్ని సన్నివేశాలను (Hari Hara Veera Mallu) చిత్ర బృందం తొలగించింది. సినిమాలో హీరో, అతడి అనుచరులు కొండ అంచున గుర్రపు స్వారీ చేసే సీన్‌ని కుదించారు. ఇక జెండా సన్నివేశాన్ని పూర్తిగా తొలగించార. పవన్ బాణాలు సంధించే సీన్‌లో చిన్నచిన్న మార్పులు చేశారు. అంతే కాక.. క్లైమాక్స్ నిడివి కూడా బాగా తగ్గించారు. మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీని సినిమా నుంచి తొలగించారు. ఈ సవరించిన వెర్షనే ప్రస్తుతం థియేటర్‌లో ప్రసారం అవుతుంది. అయితే ఈ సన్నివేశాల తొలగింపుపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.