Wednesday, July 9, 2025

విధ్వంసకర బౌలింగ్.. స్టంప్ ఇలా విరగడం ఎప్పుడూ చూసుండరూ..

- Advertisement -
- Advertisement -

క్రికెట్‌లో పేసర్లు తమ బౌలింగ్‌తో స్టంప్‌లను ఎగరవేయడం సాధారణంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అతి వేగంతో వచ్చిన బంతి కారణంగా అవి అడ్డంగా విరిగిపోతుంటాయి కూడా. అయితే ఓ మ్యాచ్‌లో వికెట్ ఏకంగా నిలువుగా చీలిపోయింది. ఇలాంటి ఘటనలు క్రికెట్‌లో చాలా అరుదుగా జరుగుతాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టి-20 బ్లాస్ట్‌లో ఇలాంటి ఘటన జరిగింది. ఈ లీగ్‌లో భాగంగా జూలై 8వ తేదీన సోమర్‌సెట్, ఎసెక్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సోమర్‌సెట్ బౌలర్ రిలే మెరిడిత్ (Riley Meredith) విధ్వంసకర బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఎసెక్స్ ఓపెనర్ కైల్ పెప్పర్‌ను మెరిడిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టంప్ నిలువుగా చీలింది. మెరిడిత్ ఈ సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. టామ్ కోహ్లెర్ 39 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఎసెక్స్‌కు సోమర్‌సెట్ బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాట్ హెన్రీ 4, మెరిడిత్ (Riley Meredith) 2, ఓవర్టన్ 2 వికెట్లు తీయడంతో 14.1 ఓవర్లలో ఎసెక్స్ ఆలౌట్ అయింది. దీంతో సోమర్‌సెట్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News