ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని వీఆర్‌కేపురం గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మేనత్త కొండగొర్ల ఎల్లక్క (55)ను ఆమె అల్లుడు కొండగొర్ల విజయ్ విచక్షణారహితంగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సిఐ ముత్యం రమేష్, ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం విజయ్ మద్యానికి బానిసై జూలయిగా తిరుగుతూ ఉండే వాడని ఈ క్రమంలోనే గురువారం తన వ్యసనాలకు నగదు ఇవ్వలేదని అత్తపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. తన చేతిలో ఉన్న కత్తితో మెడ, తలపై బలంగా దాడి చేయడంతో ఎల్లక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మేరకు నిందితుడు విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష