- Advertisement -
పింఛన్ డబ్బుల కోసం తల్లిని కుమారుడు హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వర్ని పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మోస్రా మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన గొల్ల సాయవ్వ (57) కుమారుడు గొల్ల సాయిలు తల్లి పింఛన్ డబ్బుల విషయంలో గొడవ పడి డబ్బుల ఇవ్వకపోవడంతో తల్లిని బండరాయితో తల, ఛాతి, కడుపు మీద బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన చుట్టుపక్కల కాలనీవాసులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా సాయవ్వను బోధన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులు పరీక్షించగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలి చెల్లెలు కొడుకు జెట్టి మహేష్ పోలీసులకు ఫిర్యాదు మేరకు వర్ని ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -