భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుమారుడు లిఫ్ట్‌లో(Lift) ఇరుక్కుపోవడంతో తనని కాపాడుకోలేననే భయంతో తండ్రి గుండెపోటుతో(Heart Attack) మృతి చెందారు. భోపాల్‌లోని జత్కేడి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రిషిరాజ్ భట్నాగర్(51) తన భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సోమవారం కుమారుడిని వెతుక్కుంటూ కిందకు వచ్చారు. కుమారుడు కనిపించడంతో అతన్ని ఇంటికి వెళ్లమని సూచించిగా.. ఎనిమిదేళ్ల పిల్లాడు లిఫ్ట్(Lift) ఎక్కాడు. వెంటనే పవర్‌కట్ కావడంతో లిఫ్ట్‌లో ఆ పిల్లాడు ఇరుక్కుపోయాడు. దీంతో రిషిరాజ్ తీవ్ర ఆందోళనకు గురి కావడంతో అయనకు గుండెపోటు (Heart Attack) వచ్చింది.
కొన్ని నిమిషాల్లో పవర్ రావడంతో పిల్లాడు సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే అప్పటికే పడిపోయిన రిషిరాజ్‌ను అపార్ట్‌మెంట్ వాసులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రిషిరాజ్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.