మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన సమయంలో భర్తను హత్య చేయించిన సోనమ్ రఘువంశీ నెల్లాళ్లుగా షిల్లాంగ్ జైలులో ఉన్నా, ఇప్పటికీ ఏమాత్రం పశ్చాత్తాప పడిన దాఖలాలు లేవు. ఆమె కుటుంబసభ్యులు కూడా
ఎవరూ పలకరించడానికి జైలుకు రాలేదు. అయినా ఎలాంటి చింత లేకుండా జైలు జీవితానికి అలవాటు పడుతోంది. ఇద్దరు అండర్ ట్రయిల్ ఖైదీలతో జైలు గదిలో గడుపుతున్నా. సోనమ్ తోటి ఖైదీలతో కానీ, జైలు అధికారులతో
కానీ మాట్లాడడం లేదని జైలు వర్గాలవారు తెలిపారు. ఆమెకు ఇప్పటివరకూ ఎలాంటి పని అప్పగించలేదు. త్వరలో ఆమెకు కుట్టు పనిలో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.
ఆమె రోజూ టీవీ మాత్రం చూస్తోంది.
షిల్లాంగ్ జైలులో 496 మంది ఖైదీలు ఉన్నా, మహిళా ఖైదీలు 20 మందే. హత్య కేసులో జైలులో ఉన్న వారిలో సోనమ్ రెండవ మహిళ. ఆమె పై సిసిటివి కెమెరాల నిఘా మాత్రం ఉంది.రాజా, సోనమ్ మే 11న వివాహం చేసుకున్నారు. 9 రోజుల తర్వాత వారు మే20న మేఘాలలో హనీమూన్ కోసం చేతిలో వన్-వే టికెట్ తో బయలుదేరివెళ్లారు. మూడు రోజులతర్వాత జంట తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం జరిగిన 10 రోజుల తర్వాత జూన్ 2న ఒకలోయలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. కేసు హత్య కేసు గా మారింది. జూన్ 7న రాత్రి సోనమ్ ఘాజీపూర్ లోని ఒక ధాబాలో అపస్మారక స్థితిలో కనిపించారు. ఆమెను ఘాజీపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. సోనమ్ ప్రేమికుడు రాజ్ తో సహ ముగ్గురు హంతకులను పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోనమ్ షిల్లాంగ్ జైలులో ఉంది.