భువనేశ్వర్: మాజీ సర్పంచ్, సర్పంచ్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం సోనేపూరి జిల్లా దుంగురిపాలి బ్లాక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజబంధ్ పంచాయతీకి బల్లభ్ ఖేటీ అనే వ్యక్తి సర్పంచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం ఆ గ్రామానికి బల్లభ్ భేటీ భార్య బసంతి ఖేటీ సర్పంచ్‌గా పని చేస్తున్నారు. బల్లభ్ ఖేటీ ఇంటికి వస్తుండగా పండరపాలి గ్రామ శివారులో గుర్తు తెలియన వ్యక్తులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వెంటనే అతడిని స్థానికులు గుర్తించి దుంగురిపాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే బల్లభ్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తలపై కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. రాంపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సర్పంచ్ భర్తను నరికి చంపారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -