Sunday, August 3, 2025

డబ్బుల కోసం తల్లిని కొట్టిన కొడుకులు.. కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఉండవెల్లి: డబ్బుల కోసం తల్లిని కొట్టిన కుమారులపై ఉండవెల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన కురువ లక్ష్మీదేవికి శంకర్, ఇద్దరు కుమారులు. రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుండి ఇద్దరు కుమారులు తల్లిని పట్టించుకోకపోవడంతో ఒంటరిగా జీవిస్తుంది. లక్ష్మీదేవి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఇద్దరు కుమారులు సాగు చేసుకుంటున్నారు.

శనివారం పెద్ద కుమారుడు శంకర్ తల్లి దగ్గరికి వెళ్లి రైతుబంధు డబ్బులను అడిగాడు. తల్లి నిరాకరించింది. మీకు డబ్బులు ఇస్తే నాఖర్చులకు ఎలా అని చెప్పింది. తల్లితో గొడవ పెట్టుకుని ఆమె తలపై కర్రతో కొట్టడంతో తలకు రక్త గాయమైంది. 10 రోజుల క్రితం ఆమె చిన్న కుమారుడు మల్లికార్జున రైతుబంధు డబ్బుల కోసం తల్లితో గొడవ పెట్టుకుని లక్ష్మీదేవిని కొట్టి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో లక్ష్మీదేవి ఇద్దరు కుమారులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News