లండన్: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభం క్రీజ్‌లో ఉన్న కెప్టెన్ బవుమా, బెడ్డింగ్‌హామ్.. నిలకడగా బ్యాటింగ్ చేశారు. వికెట్లు కాపాడుకుంటూ పరుగులు రాబట్టారు. అయితే పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బవుమా(36) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత భోజన విరామ సమయానికి 121 పరుగులు చేసింది.
భోజన విరామ సమయం తర్వాత వెరినే.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో మార్కో జాన్సెన్ కూడా ఔట్ అయ్యాడు. మళ్లీ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే బెడ్డింగ్‌హామ్(45) ఔట్ అయ్యాడు. అనంతరం మహారాజ్(7), రబాడా(1) స్వల్పస్కోర్‌కే డ్రెస్సింగ్ రూం బాటపట్టారు. దీంతో సౌతాఫ్రికా 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలింగ్‌లో కెప్టెన్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ 2, హెజెల్‌వుడ్ 1 వికెట్ తీశారు.