- Advertisement -
ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమ్ ఇంగ్లండ్ 24.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జేమీ స్మిత్ 10 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ నాలుగు, వియాన్ ముల్డర్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన మార్‌క్రమ్ 55 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 86 పరుగులు సాధించాడు. రికెల్టన్ 31 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.
- Advertisement -