ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్పేస్ హీరో శుభాంశు శుక్లాకు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో శుక్లా భేటీ కానున్నారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత వ్యోవగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) జులై 15న తిరిగి భూమిపైకి చేరుకున్న విషయం తెలిసిందే. అంతరిక్షంలో ఆయన 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్స్‌లో కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాలలో జులై 15న మధ్యాహ్నం 3.01 గంటలకు ల్యాండ్ అయ్యారు.
అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రికార్డు సృష్టించారు. కాగా, భూమిపైకి చేరుకున్న ఈ వ్యోమగాయుల బృందాన్ని ఏడు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచనున్నట్లు స్పేస్ ఎక్స్ అధికారులు తెలిపారు.