Sunday, July 6, 2025

ప్రయాణికులకు శుభవార్త.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. జూలై 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 25 వరకూ వివిధ రోజుల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 ప్రత్యేక రైళ్లు, కాచిగూడ నుంచి తిరుపతి మధ్య ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు, నరసాపూర్ నుంచి తిరువణ్ణమలైకి మధ్య బుధ, గురువారాల్లో 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించినున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News