పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది. ఆ రోజు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నారు పవన్. అయితే పవన్ చేస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫ్యాన్స్‌కి ఫుల్‌మీల్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1వ తేదీన సినిమా నుంచి ‘ఫుల్ మీల్స్’ పేరుతో ఓ అప్‌డేట్ రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
‘రేపు(సెప్టెంబర్ 1న) షాయంత్రం 4.45 గంటలకు ఫుల్‌మీల్స్ ఇస్తున్నాం. మా దర్శకుడు హరీశ్ శంకర్ తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని మీ అందరు ఇష్టపడేలా ఎలా చూపిస్తాడో చూడండి. ఈ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌తో పండగ చేసుకుంటారు’’ అంటూ సోషల్‌మీడియాలో చిత్ర యూనిట్ (Ustaad Bhagat Singh) ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్.. హ్యాట్ ధరించి మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : ‘అల్లు’ కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌కళ్యాణ్