Friday, August 22, 2025

2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నాం : భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును తొలగించొచ్చని, ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చుఅని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోందని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీరపల్లిలో 335 మంది భూనిర్వాసితులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామని, సిఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్సు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకువచ్చామని చెప్పారు. రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నామని, కన్వెన్షన్, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నామని, రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ అమలు చేస్తామని చెప్పారు. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News