Wednesday, July 9, 2025

డెలివరీ బాయ్‌ని ఢీకొన్న హయబూసా.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మైసూరు: కర్ణాటకలోని మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన హయబూసా వాహనం ఆ పక్కనే వెళ్తున్న జొమాటో డెలివరి బాయ్‌ని ఢీకొట్టింది. జూలై 6వ తేదీన జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయానక దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

వేగంగా వచ్చిన హయబూసా వాహనం.. వేగంగా వచ్చి జొమాటో డెలివరి బాయ్‌ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డెలివరి బాయ్‌ను కార్తీక్‌గా గుర్తించారు. కార్తీక్‌ను ఢీకొట్టిన బైక్ అతన్ని కొన్ని మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఇక హయబూసా నడుపుతున్న వ్యక్తిని సయ్యద్ సరూన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో పెట్రోల్‌ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. కాలిన గాయలతో ఉన్న సయ్యద్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News