Saturday, August 2, 2025

పురుషుల్లో గణనీయంగా తగ్గిపోతున్న వీర్యకణాల సంఖ్య

- Advertisement -
- Advertisement -

పురుషులలో సంతానోత్పత్తి సామర్థం తగ్గిపోతుండడంపై అంతర్జాతీయ అధ్యయనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఆధునిక జీవన విధానాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యాలు పెరిగిపోతుండడం పురు షుల్లో వీర్యకణాలు తగ్గిపోవడానికి చాలావరకు దోహదపడుతున్నాయని నినుణులు అంటున్నారు.ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జంటలు వంధ్యత్వ మస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా సంతానోత్పత్తి క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడానికి కారణమవుతున్నాయి.అనైతిక విధానాలను పాటిస్తున్న కారణంగా వీటిలో చాలా క్లినిక్‌లు ఇప్పుడు అధికారుల నిఘాను ఎదుర్కొంటున్నాయి.

సగానికి తగ్గిన వీర్యకణాలు
‘ హ్యూమన్ రీప్రొడక్షన్’ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త్తంగా పురుషల్లో వీర్యకణాల సంఖ్య1973నుంచి కాలంలో గణనీయంగా పడిపోయింది.1970 దశకంలో 20 30మధ్య వయసు పురుషులో ్లసగటున మిల్లీమీటరుకు దాదాపుగా 10౦మిలియన్ల వీర్యకణాలు ఉండగా, 2020 నాటికి వాటిసంఖ్య దాదాపు 50 మిలియన్ల స్థాయికి పడిపోయినట్లు ఆ అధ్యయనం పేర్కొంది. అంటే దాదాపు సగానికి పడిపోయాయన్న మాట. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థానికి పెనుముప్పు ఎదురవుతోంది. సాధారణంగా సంతానం కలగకపోవడానికి స్త్రీలలో లోపాలే కారణమనే ఒక అపోహ సమాజంలో ఉంది. అయితే మగవాళ్లలో లోపాలు కూడా అంతే కారణమని, అయితే జనం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తాజా అధ్యయనాన్ని బట్టి అర్థమవుతుంది. ఆసియా, ఆఫ్రికాలాంటి ప్రాంతాల్లో పిల్లలు

కలగకపోవడానికిమహిళలపై సామాజిక ఒత్తిళ్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా వాళ్లు తరచూ మానసిక ఒత్తిళ్లకు గురి కావడం, లేదా బహుభార్యాత్వం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.85 కోట్ల జంటలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒక్క భారత దేశంలోనే దాదాపు 2.75 కోట్ల సంతానలేమి కేసులు ఉన్నాయి. వీటిలో 48 శాతం స్త్రీలకు సంబంధించిన సమస్యలు కారణం కాగా, 31.6 శాతం పురుషులు కారణం. ఇక 20.4 శాతం కేసుల్లో సంతాన లేమికి భార్యాభర్తలు ఇద్దరూ కారణం అవుతున్నారు. సంతానోత్పత్తి లేమి సమస్యను ఎదుర్కొంటున్న పురుషుల్లో 80 శాతం మందిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం కారణం కాగా వీరిలో 7 10శాతం మందిలో వీర్యకణాల ఉత్పత్తి సున్నా శాతం ఉండడం గమనార్హం. ఈ సమస్య ఊహించినదానికన్నా చాలా విస్తృతంగా ఉందని డాక్టర్లు అంటున్నారు.

అనేక కారణాలు
పురుఫుల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, పుట్టుకతో వచ్చిన అసాధారణ లోపాలు, పునరుత్పాదక అవయవాల్లో ఇన్‌ఫెక్షన్లు వంటివి వీటిలో ఉన్నాయి. వీటికి తోడు ఆధునిక లైఫ్‌స్టైల్ ఒత్తిళ్లు, వివాహాలు ఆలస్యం కావడం, కల్తీ ఆహారాలు తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వినియోగం, కాలుష్యం, అతిగా మొబైల్‌ఫోన్ల వినియోగం లాంటివి కూడా ఈ సమస్యకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నాయి.

ఫర్టిలిటీ సెంటర్ల బూమ్
ఎప్పుడయితే వంధత్వ సమస్య పెరిగిపోవడం మొదలైందో అప్పటినుంచే దేశంలో సంతానోత్పత్తి కేంద్రాలు పెద్ద సంఖ్యలో పుట్టుకు రావడం ప్రారంభమయింది. అయితే వీటిలో చాలా కేంద్రాలు నైతిక ప్రమాణాలను పాటించడం లేదు. సంతానం పొందాలన్న దంపతుల ఆదుర్దాను అలుసుగా తీసుకుని కొన్ని సందర్భాల్లో ఈ క్లినిక్‌లు క్లయింట్లనుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగు చూసిన ‘ సృష్టి’ ఫర్టిలిటీ సెంటర్ ఉందంతం ఈ రంగంపై అత్యవసరంగా పర్యవేక్షణ, నిఘా అవసరమనే విషయాన్ని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా లోపాన్ని ముందుగా గుర్తించినట్లయితే సంతానలేమి సమస్య పరిష్కారానికిమంచి చికిత్సలే ఉన్నాయి. సమతుల్య ఆహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లను వదిలిపెట్టడం, క్రమం తప్పకుండా వ్యాయామం, మందులు తీసుకోవడం, తగినంత నిద్ర లాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం అవసరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వీర్యకణాల సంఖ్య అసలు లేకపోవడం లేదా వెరికోసిల్( శుక్రనాళాల్లో సిరలు మెలికలు తిరగడం) లాంటి తీవ్ర సమస్యలను సైతం సరిచేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. సకాలంలో వైద్యులను సంప్రతించడం, చికిత్స తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి ఫలితాలను మెరుగుపర్చవచ్చని వైద్యులు అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా దంపతులు వైద్యుల సలహా తీసుకోవడం ఆలస్య చేయరాదని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. మగవారిలో సంతాన లోపం సమస్యల పట్ల అవగాహన పెంపొందించడం, సంతానం కలగక పోవడంపై మాజంలో ఉన్న అపోహలను తొలగించడం పెరిగిపోతున్న ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన కీలక చర్యలని వారంటున్నారు. సమస్యను సకాలంలో గుర్తించి చికిత్సతీసుకోవడం జరిగితే ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలామంది మగవారు సంతాన సౌభాగ్యాన్ని పొందగలుగుతారనడంలో సందేహం లేదని వైద్య నిపుణులు అంటున్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News