Thursday, September 11, 2025

కదులుతున్న ఆటోలో వేలాడుతూ… సహాయం కోసం అరుపులు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: పట్టపగలే కదులుతున్న ఆటోలో ఓ మహిళను దుండగులు బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆటోలో నుంచి వేలాడుతూ సహాయం కోసం అరిచింది. దుండుగులతో మహిళ ధైర్యంగా పోరాడి తప్పించుకుంది. ఈ సంఘటన పంజాబ్‌లోని జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై జరిగింది. మహిళ ఆటో ఎక్కిన వెంటనే కొంచెం దూరం వెళ్లిన తరువాత డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమె వద్ద దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆమె భయపడకుండా ఆటో నుంచి బయటికి వేలాడుతూ సహాయం కోసం బిగ్గరగా అరిచారు. దాదాపు అర కిలోమీటరు దూరం అలాగే వేలాడారు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం ఆటో వేగంగా వెళ్లి ఓ కారును ఢీకొట్టింది. దీంతో స్థానికులు దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ మారింది. ఆటో వాలాలను కూడా నమ్మేటట్టు లేదని నెటిజన్లు వాపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడంతో వాపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని వాపోయారు.

Also Read: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News