విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. (Arjun chakravathi) విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చాయి. సోమవారం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. “ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంటుంది.
మా హీరోయిన్ సిజ్జా రోజ్ కూడా చాలా కష్టపడింది. అందరికీ నచ్చే ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాం”అని అన్నారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ “నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మం డచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. మా డైరెక్టర్ అంకితభావంతో(director is dedicated) ఈ సినిమా తీశారు. చాలా మంచి సినిమా ఇది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ చాలా అద్భుతమైన విజువల్స్, మంచి భావోద్వేగాలు, కథ ఉన్న సినిమా ఇదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిజ్జా రోజ్, దుర్గేష్, విఘ్నేష్ భాస్కరన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.